Baba Siddique murder case: బాబా సిద్ధిఖీ హత్య కేసులో మరో ఇద్దరు అరెస్టు

సంచలనం సృష్టించిన మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్య కేసులో మరో కీలక పరిణామం జరిగింది.

Update: 2024-10-15 09:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సంచలనం సృష్టించిన మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్య కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బహ్రెయిచ్ లో నిందితులతను తీసుకున్నారు. షూటర్ ధర్మరాజ్ కశ్యప్ సోదరుడు అనురాగ్ కశ్యప్, పూణేలో స్క్రాప్ దుకాణం యజమాని అయిన హరీష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మరాజ్ కశ్యప్, శివప్రసాద్ గౌతమ్, అనురాగ్ కశ్యప్‌లకు డబ్బులు, కుర్లాలో అద్దె ఇల్లు, బైక్ అందించినట్లు హరీష్ కశ్యప్ పై ఆరోపణలు ఉన్నాయి. హరీష్ కు బాబా సిద్ధిక్ హత్య గురించి తెలుసని అధికారులు తెలిపారు. శివప్రసాద్ గౌతమ్, ధర్మరాజ్ కశ్యప్ లు నేరం చేసేందుకు కొన్నిరోజుల ముందు కొత్త మొబైల్ కూడా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు అరెస్టయిన ఇద్దరు నిందితుల నుంచి పోలీసులు రెండు పిస్టల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ధర్మరాజ్ కశ్యప్, గుర్మైల్ సింగ్, ప్రవీణ్ లోంకర్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయగా.. మరో ముగ్గురు నిందితులు శుభమ్ లోంకర్, శివ్ కుమార్ గౌతమ్, మహ్మద్ జీషన్ అక్తర్ పరారీలో ఉన్నారు. గుర్మైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్ లు అక్టోబర్ 21 వరకు పోలీసుల కస్టడీలోనే ఉండనున్నారు.

బాబా సిద్ధిఖీ హత్య

ఇకపోతే, శనివారం రాత్రి మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే, అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు బాధ్యత వహిస్తూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా గ్యాంగ్ స్టర్ తో షూటర్లకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కాగా, ఈ కేసులోనే పోలీసులు దర్యాప్తుని సాగిస్తున్నారు. కొత్త అరెస్టులతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఐదుకి చేరింది.


Similar News