ఎగ్జిట్‌పోల్స్, ఈవీఎంల ట్యాపరింగ్‌పై ఈసీ సంచలన ప్రకటన

ఎగ్జిట్‌ పోల్స్‌(exit polls)లో ఎన్నికల సంఘం(Election Commission) ప్రమేయం ఏమాత్రం ఉండబోదు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్(Rajeev Kumar) స్పష్టం చేశారు.

Update: 2024-10-15 10:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎగ్జిట్‌ పోల్స్‌(exit polls)లో ఎన్నికల సంఘం(Election Commission) ప్రమేయం ఏమాత్రం ఉండబోదు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్(Rajeev Kumar) స్పష్టం చేశారు. మంగళవారం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకటనలో స్వీయ నియంత్రణ అవసరం అని అభిప్రాయపడ్డారు. అసలు ఎగ్జిట్‌పోల్స్‌కు శాస్త్రీయత లేదని అన్నారు. కౌంటింగ్ స్టార్ట్ అయిన పది నిమిషాలకే రిజల్ట్స్ వేయడం నాన్సెన్స్ అని మండిపడ్డారు. ఉదయం 9:30 గంటల కంటే ముందు ఇచ్చే ఫలితాలు అంతా బోగస్ అని కొట్టిపారేశారు. ఎగ్జిట్ పోల్స్(exit polls) ఆధారంగా తమపై నిందలు వేయడం అర్ధరహితం అని అన్నారు.

కొందరు ఈవీఎంలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని అన్నారు. ఆరు నెలల ముందే ఈవీఎం మిషన్లను పరిశీలించి వినియోగిస్తామని స్పష్టం చేశారు. పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంలను ఉపయోగిస్తున్నాం. పోలింగ్‌కు ఐదు రోజుల ముందే బ్యాటరీలను, సింబల్స్‌ను అమర్చుతాం, మూడంచెల భద్రత మధ్య ఈవీఎంలు ఉంటాయని రాజీవ్ కుమార్ అన్నారు. కేవలం ఎగ్జిట్ పోల్స్‌ అన్నీ అంచనాలు మాత్రమే అని తెలిపారు. అవి నమ్మి ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని చెప్పారు.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరుపనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు. గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 22న వెలువడుతుంది. నామినేషన్ల గడవు అక్టోబర్ 29వ తేదీతో ముగుస్తుంది. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 30న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్ 4వ తేదీతో ముగుస్తుంది. నవంబర్ 25వ తేదీలోగా ఎన్నికలు ముగియాల్సి ఉంటుంది.



Similar News