రూ.20 వేలు డౌన్ పేమెంట్ తో మోపెడ్.. డీజేకి అయిన ఖర్చెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ఓ ఛాయ్ వాలా రూ.20 వేలతో మోపెడ్ కొని.. రూ.60 వేలతో డీజే పెట్టించి ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

Update: 2024-10-15 14:17 GMT

దిశ, వెబ్ డెస్క్: అతనొక ఛాయ్ వాలా. మధ్యప్రదేశ్ లోని శివపురిలో టీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటి నుంచో మోపెడ్ కొనుక్కోవాలని ఆశ. అందుకోసం రూ.20 వేలు దాచి డౌన్ పేమెంట్ చేసి.. మిగతా అమౌంట్ ఈఎంఐ ఆప్షన్ తీసుకున్నాడు. కొన్నది మోపెడే (Moped) అయినా.. దానిని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. ఓకే.. సెలబ్రేషన్ అంటే.. మనోడు బిర్యానీ- కూల్ డ్రింక్ తో సరిపెట్టుకున్నాడనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. మోపెడ్ కొన్నది రూ.20 వేలు డౌన్ పేమెంట్ చేసే అయినా.. అందుకు అతను డీజేకి పెట్టిన ఖర్చు రూ. 60 వేలు. షాకయ్యారు కదా. ఆ ఇరవై వేలకు ఈ అరవై వేలు కలిపితే.. ఈఎంఐ ఆప్షన్ లేకపోవు కదా అనుకుంటున్నారు ఈ విషయం తెలిసినవాళ్లు.

మురారి లాల్ కుశ్వాహా అనే టీ సెల్లర్ ఇటీవలే ముచ్చటపడి.. అప్పుచేసి ఓ మోపెడ్ కొనుక్కుకున్నాడు. తాను టూ వీలర్ కొనుక్కున్న సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం డీజే పెట్టించాడు. ఆ మోపెడ్ ను ఎత్తేందుకు జేసీబీని తెప్పించాడు. దీనంతటికీ అతను ఏకంగా రూ.60 వేలు ఖర్చు చేశాడు. ఇది అతను కట్టిన డౌన్ పేమెంట్ కు మూడింతలు అధికం. షో రూమ్ నుంచి మోపెడ్ ను ఊరంతా చూపిస్తూ తీసుకొచ్చాడు. సరే అతని డబ్బు అతనిష్టం. అంతా బాగానే ఉంది కానీ.. పోలీసోళ్లకి కోపమొచ్చింది.

మురారి మోపెడ్ కొన్న సందర్భాన్ని డీజేతో సెలబ్రేట్ చేసుకోగా.. అందుకు వచ్చిన శబ్ధకాలుష్యంపై చర్యలు చేపట్టారు పోలీసులు. డీజే ఆపరేటర్, మురారిలపై కేసు ఫైల్ చేశారు. గతంలోనూ మురారి రూ.12500 పెట్టి ఫోన్ కొని.. రూ.25 వేలతో సెలబ్రేషన్స్ చేశాడట. తన పిల్లల ఆనందం కోసం ఇలాంటి వేడుకలు చేస్తుంటానని చెప్పడం గమనార్హం. ఈ విషయం తెలిసినవాళ్లు నోరెళ్లబెట్టి ఇదెక్కడి విడ్డూరమని ఆశ్చర్య పోతున్నారు. 

Full View


Similar News