మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 26న మహరాష్ట్ర, జనవరి 5న జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుంది.

Update: 2024-10-15 10:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర(Maharashtra), జార్ఖండ్(Jharkhand) ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) విడుదల చేసింది. నవంబర్ 26న మహరాష్ట్ర, జనవరి 5న జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుంది. దీంతో మహారాష్ట్రలోని మొత్తం 285 సీట్లకు, జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మహరాష్ట్రలో మొత్తం 9 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు ఉండగా.. జార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మహారాష్ట్రలో 186 పోలింగ్ బూత్‌లు, 29వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు.

మహారాష్ట్రలో అక్టోబర్ 22న నోటిఫికేషన్, నవంబర్ 20న ఎన్నికలు, 23న ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ స్పష్టం చేసింది. సింగిల్ ఫేజ్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. జార్ఖండ్లతో రెండు దశల్లో ఎన్నికల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. నవంబర్ 13న నోటిఫికేషన్, 20న ఎన్నికలు, 23న ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశారు. అంతకుముందు.. ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జమ్ము కశ్మీర్, హర్యానా ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాం. కశ్మీర్ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఉగ్రవాదులకు, ఉగ్రదాడులకు భయపడకుండా ప్రజలకు ధైర్యంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్క హింసాత్మక ఘటన కూడా జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించినా కొందరు విమర్శలు చేశారు. ప్రస్తుతం ఫిర్యాదులు స్వీకరించడానికి సీ-విజిల్ యాప్ అందుబాటులో ఉంటుందని రాజీవ్ కుమార్ వెల్లడించారు.


Similar News