Tmc : పశ్చిమ బెంగాల్ బైపోల్స్‌లో టీఎంసీ క్లీన్ స్వీప్.. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది.

Update: 2024-11-23 09:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ (West benghal) అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ (Mamath benarjee) నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(TMC) క్లీన్ స్వీప్ చేసింది. 6 స్థానాలకు బైపోల్స్ జరగగా అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రంలోని సీతాయ్, మదారిహత్, హరోవా, నైహతి, మేదినీపూర్, తల్దంగ్రా నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించగా అన్ని సెగ్మెంట్లలో టీఎంసీ అభ్యర్థులు గెలుపొందారు. సీతై నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి సంగీతా రాయ్ ఏకంగా లక్షా 1,30,636 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాయ్‌కు 3,65,984 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 35,348 ఓట్లు వచ్చాయి. అలాగే మదరిహత్ నియోజకవర్గంలో టీఎంసీకి చెందిన జయప్రకాష్ టోప్ఫో గెలుపొందారు. దీంతో 2021లో బీజేపీ గెలుపొందిన ఈ సీటులో టీఎంసీ పాగా వేసింది. ఆ స్థానంలో పదేళ్ల తర్వాత టీఎంసీ గెలుపొందడం గమనార్హం.

ఈ ఫలితాలపై సీఎం మమతా బెనర్జీ (CM mamath benarjee) స్పందించారు. టీఎంసీ నాయకులకు అభినందనలు తెలిపారు. ‘ప్రజల కోసం మరింతగా పని చేయడానికి మీ ఆశీర్వాదాలు మాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. మేమంతా సామాన్యులం. అదే బాటలో పయనిస్తాం. ఇంకా మరెన్నో విజయాలు సాధిస్తాం’ అని తెలిపారు. మమతా బెనర్జీ ఇంటి ఎదుట టీఎంసీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. కాగా, ఆర్జీకర్ ఆస్పత్రిలో డాక్టర్‌పై జరిగిన లైంగిక దాడి హత్య ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన ఉపఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని అంతా భావించారు. కానీ అందుకు విరుద్ధంగా ఫలితాలు వెలువడ్డాయి. దీంతో తాజా ఫలితాలు ప్రతిపక్షాల విమర్శలను తిరస్కరించాయని టీఎంసీ మద్దతు దారులు వాపోతున్నారు.


Read More..

Natural Cancer Treatment: క్యాన్సర్ ఫైనల్ స్టేజ్.. నా భార్యను అలా బ్రతికించుకున్నా : నవజ్యోత్ సింగ్ సిద్ధూ


Tags:    

Similar News