Karnataka-Maharashtra సరిహద్దు వివాదంపై స్పందించిన శరద్ పవార్

కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు

Update: 2022-12-06 12:28 GMT

బెంగళూరు: కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని చెప్పారు. అయితే పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటంతో మహారాష్ట్ర మంత్రుల పర్యటన రద్దైంది. గత కొన్ని వారాల నుంచి పరిస్థితిని వేరే దిశలో తీసుకెళ్లేందుకు కర్ణాటక సీఎం చేతనైన ప్రయత్నాలు చేస్తున్నారని పవార్ పేర్కొన్నారు. మరోవైపు బెలగావిలో మరోసారి నిరసనలు రేగాయి. మహారాష్ట్ర నుంచి వస్తున్న ట్రక్కులపై స్థానికులు రాళ్లతో దాడులు చేశారు. వాటిని నిలిపివేసి నల్ల ఇంకు చల్లి నిరసనకు దిగారు.

Tags:    

Similar News