కచ్చతీవు స్వాధీనంపై ప్రయత్నమేదీ..తమిళనాడు సీఎం స్టాలిన్

కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ, 1974లో శ్రీలంకకు భారత్ అప్పగించిన కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఎటువంటి ప్రయత్నం జరగలేదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు

Update: 2024-07-02 19:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ, 1974లో శ్రీలంకకు భారత్ అప్పగించిన కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఎటువంటి ప్రయత్నం జరగలేదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఎన్నికల ముందు మాత్రమే బీజేపీ దీనిపై హడావుడి చేసిందని తెలిపారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్‌కు మంగళవారం లేఖ రాశారు. ‘ఇటీవల శ్రీలంక నావికాదళం తమిళనాడుకు చెందిన భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసిన ఘటనలు గణనీయంగా పెరిగాయి. దీనికి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోండి. రాష్ట్రానికి చెందిన మత్య్సకారుల హక్కులను కాపాడండి’ అని లేఖలో పేర్కొన్నారు. జూలై 1న శ్రీలంక నేవీ 25 మంది మత్స్యకారులతో పాటు రెండు మోటరైజ్డ్ కంట్రీ క్రాఫ్ట్‌లు, రెండు రిజిస్టర్డ్ ఫిషింగ్ బోట్‌లను పట్టుకున్నట్టు తెలిపారు. తమిళనాడు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Similar News