వాయు కాలుష్యానికి మనదేశంలో ఏటా 33వేల మంది బలి

దిశ, నేషనల్ బ్యూరో : వాయుకాలుష్యం చాపకింద నీరులా వ్యాపిస్తూ ప్రజల ఆరోగ్యాల్ని గుల్లబారుస్తోంది.

Update: 2024-07-04 19:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో : వాయుకాలుష్యం చాపకింద నీరులా వ్యాపిస్తూ ప్రజల ఆరోగ్యాల్ని గుల్లబారుస్తోంది. ఈ కారణంగా రోజూ మనదేశంలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు. భారత్‌లోని బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, పూణే, అహ్మదాబాద్, షిమ్లా, వారణాసి నగరాల్లో రోజూ నమోదవుతున్న మరణాల్లో దాదాపు 7 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణం. ఈమేరకు వివరాలతో ‘ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్’ జర్నల్ సంచలన అధ్యయన నివేదికను ప్రచురించింది. ఆయా నగరాల్లోని గాలిలో పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5 మోతాదులో ప్రమాదకర కాలుష్య కారకాలు ఉన్నాయని స్టడీలో గుర్తించారు. ధూళికణాల రూపంలోని ఈ కాలుష్య కారకాలు మనం పీల్చే గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించి శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. మన దేశంలో ఏటా 33వేల మంది వాయు కాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతుండగా.. వారిలో 12వేల మంది ఢిల్లీవాసులే ఉంటున్నారని లాన్సెట్ నివేదిక పేర్కొంది. వాయు కాలుష్యం కారణంగా ఏటా ముంబైలో 5,100 మంది, కోల్‌కతాలో 4,700 మంది, చెన్నైలో 2,900 మంది, అహ్మదాబాద్‌లో 2,500 మంది, బెంగళూరులో 2,100 మంది, హైదరాబాద్‌లో 1,600 మంది చనిపోతున్నారని తెలిపింది.


Similar News