పూరీలో ఘనంగా జగన్నాథ రథయాత్ర..హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండు రోజుల పాటు రథయాత్ర కొనసాగనుంది. ఆదివారం సూర్యాస్తమయం వరకు రథయాత్ర కొనసాగగా.. సోమవారం గుండిచా ఆలయం వైపు తిరిగి రథయాత్ర ప్రారంభమవుతుంది.

Update: 2024-07-07 13:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండు రోజుల పాటు రథయాత్ర కొనసాగనుంది. ఆదివారం సూర్యాస్తమయం వరకు యాత్ర కొనసాగగా.. సోమవారం గుండిచా ఆలయం వైపు తిరిగి ప్రారంభం కానుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. భక్తులతో కలిసి జగన్నాథ రథాన్ని లాగారు. అలాగే ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, సీఎం మోహన్ చరణ్ మాఝీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హాజరయ్యారు. ‘ఎంతో ప్రఖ్యాతి గాంచిన జగన్నాథుని రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు. జగన్నాథ ప్రేమికులు రథంపై ఆసీనులైన భగవత్ స్వరూపాలను చూస్తేందుకు దేశమంతా ఆసక్తిగా ఉంది’ అని ముర్ము ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. మరోవైపు జగన్నాథ రథయాత్ర సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.


Similar News

టమాటా @ 100