బెంగాల్ వైద్యుల ఆమరణ నిరాహార దీక్ష

తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదని, అందుకు ఇచ్చిన గడువు కూడా ముగిసిందని పేర్కొంటూ జూడాలు కోల్‌కతా నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

Update: 2024-10-05 20:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌జీ కర్ హాస్పిటల్‌‌లో జరిగిన హత్యాచార ఘటన ఇంకా హీట్ పుట్టిస్తూనే ఉన్నది. ఈ ఘటన నేపథ్యంలో మరణించిన తమ సహచర వైద్యురాలి కుటుంబానికి న్యాయం సహా మరికొన్ని డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు ధర్నాలు చేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదని, అందుకు ఇచ్చిన గడువు కూడా ముగిసిందని పేర్కొంటూ జూడాలు కోల్‌కతా నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.దుర్గా పూజకు మరో మూడు రోజులు ఉండగా మొదలైన ఈ ఆమరణ నిరాహార దీక్షకు దిగడం గమనార్హం.

ఓ జూనియర్ డాక్టర్ మాట్లాడుతూ.. ‘మా డిమాండ్లను ఇచ్చిన గడువులోగా పూర్తి చేయలేదు. అందుకే మేం నిరాహార దీక్షకు దిగుతున్నాం. మా డిమాండ్లు పూర్తయ్యే వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. మా దీక్షలో పారదర్శకత కాపాడటానికి డయాస్ పై సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశాం. మా కొలీగ్స్ ఇప్పుడు దీక్షలో ఉన్నారు. ముందుగా ఆరుగురు డాక్టర్లు దీక్షలో ఉంటారు’ అని వివరించారు. నిన్న రాత్రి తాము డ్యూటీలో చేరామని, కానీ, ఆహారం తీసుకోలేదని తెలిపారు. నిరాహార దీక్ష చేస్తున్నవారిలో ఎవరికి ఏమైనా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

Tags:    

Similar News

టమాటా @ 100