ఆ సమయంలో జైలు పాలైన 301 మందికి నెలకు ₹15,000 ఇవ్వనున్న ప్రభుత్వం

అస్సాం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ కాలంలో జైలు శిక్ష అనుభవించిన 301 మందికి నెలకు ₹15,000 పెన్షన్ అందించనున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2023-04-20 04:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: అస్సాం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ కాలంలో జైలు శిక్ష అనుభవించిన 301 మందికి నెలకు ₹15,000 పెన్షన్ అందించనున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాస్వామ్యం పట్ల అలాంటి వ్యక్తుల సహకారాన్ని గుర్తించేందుకు ఇలా చేయడం జరిగిందని రాష్ట్ర మంత్రి అశోక్ సింఘాల్ తెలిపారు. "ఒకవేళ.. ఎమర్జెన్సీ కాలంలో శిక్ష అనుభవించిన వ్యక్తి లేకుంటే, అతని భార్యకు ఆ మొత్తం లభిస్తుంది, ఇద్దరు చనిపోతే, వారి పెళ్లి కాని కుమార్తెకు ఈ మొత్తం లభిస్తుంది" అని ఆయన చెప్పారు.

Tags:    

Similar News