దేశంలో మరోసారి వెలుగులోకి డేంజరస్ నిఫా వైరస్.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..!

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా లాంటి మరో డేంజరస్ వైరస్ ‘నిఫా’ దేశంలో మళ్లీ వెలుగులోకి వచ్చింది. తాజాగా నిఫా వైరస్ సోకి కేరళ

Update: 2024-07-21 11:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా లాంటి మరో డేంజరస్ వైరస్ ‘నిఫా’ దేశంలో మళ్లీ వెలుగులోకి వచ్చింది. తాజాగా నిఫా వైరస్ సోకి కేరళ రాష్ట్రంలోని మళ్లప్పురానికి చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వైరస్ సోకినట్లు నిర్థారణ అయిన గంటలోనే బాలుడు మృతి చెందినట్లు కేరళ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో నిఫా వైరస్ మళ్లీ కలకలం రేపడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు నిఫా వైరస్ కేసు నమోదైన కేరళ రాష్ట్రానికి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య బృందాన్ని పంపింది. కొజికోడ్‌కు బీఎస్ఎల్-3 మొబైల్ ల్యాబ్ వెహికల్ పంపి వైరస్ సోకి మృతి చెందిన బాలుడు కుటుంబ సభ్యులను కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి అందరి నుండి శాంపిల్స్‌ సేకరణ మొదలుపెట్టింది.

నిఫా వైరస్ సోకి మరణాలు సంభవిస్తోన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా క్వారంటైన్ చర్యలకు కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, మనుషుల ప్రాణాలు తీసే ఈ వైరస్ మొదటి సారి 1999లో వెలుగులోకి వచ్చింది. జంతువుల ద్వారా ఈ నిఫా వైరస్ మనుషులకు సోకుతుంది. ఈ వైరస్‌కు విరుగుడుగా వ్యాక్సిన్ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా మాదిరిగానే కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్, ఐసోలేషన్ ప్రాసెస్ ద్వారానే నిఫా వైరస్‌ను కట్టడి చేయవచ్చు. కేరళ రాష్ట్రంలో 2018లో కూడా నిఫా వైరస్ కలకలం సృష్టించింది. ఈ వైరస్ సోకి 27 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, వ్యాక్సిన్ కూడా లేని ఈ వైరస్‌ను కేరళ ప్రభుత్వం విజయవంతంగా అరికట్టింది. తాజాగా మరోసారి నిఫా వైరస్ బయటపడటంతో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.


Similar News