తుఫాన్ బీభత్సం..అల్లకల్లోలంగా అరేబియా సముద్రం

తీర ప్రాంతం అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.

Update: 2023-06-15 05:22 GMT

దిశ,వెబ్‌డెస్క్: తుఫాన్ దెబ్బకు అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. గుజరాత్ తీర ప్రాంతం అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫాన్ ప్రభావానికి ద్వారాకా, సోమనాథ్ ఆలయాలను మూసివేశారు. ద్వారకా ఆలయ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. కచ్ జిల్లా జఖావు రేవు సమీపంలో తుఫాన్ కేంద్రీకృతం అయింది. దీవ్రరూపం దాల్చిన బిపర్‌జోయ్ దాటికి ముంబయి సముద్రం అంతా అల్లకల్లోలలంగా ఉంది. సముద్రం నుంచి నీరు బయటకు పొర్లి వస్తోంది. తీవ్రమైన ఈదురుగాలులు వస్తున్నాయి. వాతావరణ శాఖ ఊహించినట్లుగానే తుఫాన్ తీవ్రతరం అయింది. ముందు జాగ్రత్త చర్యగా రైల్వే శాఖ 76 రైళ్లను రద్దు చేసుకుంది. కేంద్ర మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 75వేల మంది తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్ తీరప్రాంతంలో ఇళ్లలోకి సముద్రం దూసుకొస్తోంది. 


Similar News