Amanatullah : ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా అరెస్ట్ వ్యవహారం..ఈడీ వివరణ కోరిన హైకోర్టు

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్‌పర్సన్‌గా ఉన్న కాలంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఈనెల మొదటివారంలో ఈడీ అరెస్టు చేసింది.

Update: 2024-09-19 18:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్‌పర్సన్‌గా ఉన్న కాలంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఈనెల మొదటివారంలో ఈడీ అరెస్టు చేసింది. అయితే మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును అమానతుల్లా ఖాన్ ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన న్యాయస్థానం ఈడీ వివరణను కోరింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 18కి వాయిదా వేసింది.


Similar News