ప్రయాణికురాలిపై రైలులోనే మూత్రవిసర్జన చేసిన టీసీ
ఎయిర్ ఇండియా విమానంలో సాటి ప్రయాణికులపై మూత్ర విసర్జన ఘటన ఇటీవల వెలుగుచూసిన క్రమంలో తాజాగా ఇదే తరహా ఘటన.. ఓ ప్యాసింజర్ రైలులో చోటుచేసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఎయిర్ ఇండియా విమానంలో సాటి ప్రయాణికులపై మూత్ర విసర్జన ఘటన ఇటీవల వెలుగుచూసిన క్రమంలో తాజాగా ఇదే తరహా ఘటన.. ఓ ప్యాసింజర్ రైలులో చోటుచేసుకుంది. పంజాబ్లోనిఅమృత్సర్నుంచి కోల్‌కతా వెళ్తున్న అకల్ తఖ్త్ ఎక్స్ప్రెస్రైలు భోగీలో తాగిన మత్తులో (టీసీ) రైలులో ప్రయాణిస్తున్న ఒక మహిళపై మూత్రవిసర్జన చేసినట్లు ఆరోపణలు రావడంతో అతన్ని అరెస్టు చేశారు.
టీటీఈ మూత్రవిసర్జన చేసిన సమయంలో ఆమె తన బెర్త్‌పై నిద్రపోతోంది. దీనిని గమనించిన మహిళ భర్తతో పాటు తోటి ప్రయాణికులు అతడిని పట్టుకొని ఉత్తర్ప్రదేశ్లఖ్నవూలోని చార్బాగ్ రైల్వే పోలీసులకు అప్పగించారు. రైల్వే ఉద్యోగిని బీహార్‌కు చెందిన మున్నా కుమార్‌గా గుర్తించారు. మహిళ, ఆమె భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్నిందితుడిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు.