Tamil Nadu: తమిళనాడు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

తమిళనాడు(Tamil Nadu) ముసాయిదా ఓటర్ల జాబితా(Electoral Rolls Draft) విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఈ జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 6 కోట్లను దాటింది.

Update: 2024-10-29 14:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు(Tamil Nadu) ముసాయిదా ఓటర్ల జాబితా(Electoral Rolls Draft) విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఈ జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 6 కోట్లను దాటింది. తమిళనాడులో మొత్తం ఓటర్లు 6,27,30,588 కాగా, ఇందులో 3,07,90,791 మంది పురుషులు, 3,19,30,833 మంది మహిళలు, 8,964 థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. షోలింగనల్లూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు(6,76,133) ఓటర్లు ఉండగా, నాగపట్టిణంలోని కిల్వెలూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,73,230 మంది ఓటర్లు ఉన్నారు.

వచ్చే నెల 16-17 తేదీలు, 23-24 తేదీల్లో నియోజకవర్గంలోని నిర్దేశిత పోలింగ్ కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఓటర్ల జాబితాలో మార్పు చేర్పులకు అవసమైన ఫామ్స్‌ను ఓటర్లకు అందించనున్నారు. ఈ కార్యక్రమాల్లో ఓటర్ కార్డు(Voter Card)తో ఆధార్‌ను లింక్ చేసుకోవడానికి ఓటర్లకు అవకాశం ఇవ్వనున్నారు.

Tags:    

Similar News