India Election History : చరిత్రలో ఫస్ట్ టైం.. ఆ తెగకు చెందిన 19 మందికి ఓటర్ల జాబితాలో చాన్స్

భారత దేశ చరిత్రలో తొలిసారిగా అండమాన్ నికోబార్ ఐస్‌లాండ్‌ జరావా తెగకు చెందిన 19 మందిని ఓటర్ల జాబితాలో చేర్చారు.

Update: 2024-11-22 11:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భారత దేశ చరిత్రలో తొలిసారిగా అండమాన్ నికోబార్ ఐస్‌లాండ్‌ జరావా తెగకు చెందిన 19 మందిని ఓటర్ల జాబితాలో చేర్చారు. వీరికి స్పెషల్ సమ్మరీ ప్రొవిజన్-2025 ప్రకారం అవకాశం కల్పించారు. సౌత్ అండమాన్‌కు చెందిన ఎస్‌డీఎం అధికారి వినాయక్ చమాడియా తెలిపిన వివరాల ప్రకారం.. ‘స్పెషల్ సమ్మరీ రివిజన్‌లోని ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా 19 మంది జరావా తెగకు చెందిన వారికి ఓటర్ల జాబితాలో చోటు కల్పించాం.’ అన్నారు. అండమాన్ నికోబార్ దీవుల చీఫ్ సెక్రటరీ కేశవ్ చంద్ర, దక్షిణ అండమాన్ జిల్లా ఎన్నికల అధికారి అర్జున్ శర్మ నేతృత్వంలో జరావాలు ఓటర్ల జాబితాలో చేరారని తెలిపారు. ఓటర్ల జాబితాలో చేరిన 19 మంది జరావాలు దక్షిణ అండమాన్‌లోని జిర్ ఖతంగ్ ప్రాంతానికి చెందిన వారన్నారు. ఐస్‌లాండ్‌లో ఉంటున్న వారందరినీ సాధ్యమైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని ఆయన కోరారు.

జరావాల జీవన శైలి..

1974లో జరావాల జాతి ఆవిర్భవించింది. జరావాలు వేటాడుతూ సంచార జాతులుగా తమ జీవనాన్ని సాగిస్తారు. అడవి పందులు, ఉడుములను విల్లు, బాణాలతో వేటాడుతారు. వేట సమయంలో కుక్కలను వీరు వినియోగించరు. మగవారు తీరం వెంబడి నీటిలో బాణాలతో, మహిళలు బాస్కెట్‌లతో చేపలను పడతారు. శత్రుత్వం లేని ఈ జాతి ఎవరినైనా కలిసేందుకు వెళ్లినప్పుడు కొబ్బరిబోండాలు, అరటి, ఇతర పండ్లను గిఫ్టులుగా తీసుకెళ్తారు. ప్రవాహాలను దాటడానికి తెప్పలను వినియోగిస్తారు. 2001 జనాభా లెక్కల ప్రకారం 240 మంది జరావాలు ఉన్నారు.

Tags:    

Similar News