Rahul Gandhi : రాహుల్ గాంధీకి రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు

కాంగ్రెస్ అగ్రనేతలకు పరువునష్టం నోటీసులు జారీ అయ్యాయి.

Update: 2024-11-22 12:19 GMT
Rahul Gandhi : రాహుల్ గాంధీకి రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేతలకు పరువునష్టం నోటీసులు జారీ అయ్యాయి. రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి బీజేపీ నేత వినోద్ తావ్డే ఈ నోటీసులు పంపించారు. రాహుల్ తోపాటు మల్లిఖార్జున ఖర్గే(Mallikharjuna kharge)కు రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు అందాయి. మహారాష్ట్ర ఎనికల ముందు ఒక హోటల్లో ఓటర్లకు వినోద్ డబ్బులు పంచుతున్న పలు వీడియోలు సోహల్ మీడియాలో, పలు వార్తా ఛానెల్స్ లో ప్రసారం అవడం సంచలనం రేపింది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఆరోపణలు ఖండించిన వినోద్.. వారికి పరువునష్టం నోటీసులు పంపించారు.

Tags:    

Similar News