NEET UG 2024: నీట్ యూజీ పలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నీట్-యూజీ 2024 మెడికల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది.

Update: 2024-07-18 11:07 GMT

దిశ, వెబ్ డెస్క్: నీట్-యూజీ 2024 మెడికల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేసును విచారిస్తుంది. నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలని కొంతమంది అభ్యర్థులు కోర్టులో తమ వాదనలు వినిపించగా.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మొత్తం పరీక్ష పవిత్రత కోల్పోయినప్పుడే, ఒక నిర్దిష్ట ప్రాతిపదికన మాత్రమే రీ-ఎగ్జామినేషన్ నిర్వహించడానికి ఆదేశాలు ఇవ్వగలమని పేర్కొంది.

కాగా ఈ నీట్ కు సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ కోర్టులో దాఖలైన 40కి పైగా పిటీషన్లపై ఈ రోజు సుప్రీంకోర్టు విచారించింది. ముగ్గురు న్యాయముర్తులతో కూడిన ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అలాగే నీట్‌-యూజీ పరీక్షల మార్కులును పరీక్ష కేంద్రాల వారీగా విడుదల చేయాలని, ఎల్లుండి 12 గంటల లోపు ఫలితాలు వెబ్ సైట్ లో ఉండాలని సూప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే ఈ పలితాల్లో ఎక్కడ కూడా విద్యార్థుల పేర్లను విడుదల చేయవద్దని కోర్టు ఎన్టీఏకు స్పష్టంగా తెలిపింది.

Tags:    

Similar News