Supreme Court: కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు.. అసలు విషయం ఇదే!

కేంద్ర ఎన్నికల సంఘానికి (CEC) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది.

Update: 2024-12-02 07:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘానికి (CEC) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. ఒక్కో పోలింగ్ బూత్‌లో గరిష్టంగా ఓటర్ల సంఖ్యను 1,200 నుంచి 1,500లకు పెంచడాన్ని సవాలు చేస్తూ ఇందు ప్రకాశ్ సింగ్ (Prakash Singh) దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ సంజీవ్ ఖన్నా (CJI Sanjeev Khanna), జస్టిస్ సంజయ్ కుమార్ (Sanjay Kumar) ద్విసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ మేరకు మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి (CEC) నోటీసులు జారీ చేసింది.

పోలింగ్ బూత్‌ (Polling Booth)లో ఓటర్ల సంఖ్యను పెంచాలనే నిర్ణయం పూర్తిగా ఏకపక్షమని, ఏ నివేదికల ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఆ నిర్ణయం తీసుకుందో కోర్టుకు చెప్పాలని ప్రకాశ్ సింగ్ (Prakash Singh) తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ (Abhishek Singhvi) తన వాదనలు వినిపించారు. ఓటర్ల సంఖ్యను 1,200 నుంచి 1,500కి పెంచడం వల్ల అనేక సమస్యలను ఉత్పన్నం అవుతాయని అన్నారు. ఈవీఎం (EVM) ఓటింగ్ సిస్టమ్‌తో ఒక వ్యక్తి ఓటు వేసేందుకు చాలా సమయం పడుతోందని ధర్మాసనానికి విన్నవించారు. పోలింగ్ స్టేషన్ల ఎదుట పెద్ద సంఖ్యలో క్యూ, వెయిటింగ్ పీరియడ్‌ కారణంగా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయలేకపోతున్నారని వాదించారు. ఈ క్రమంలోనే వారిని ఆయా పార్టీల నేతలు మభ్యపెట్టే అవకాశం కూడా ఉందని అభిషేక్ సంఘ్వీ (Abhishek Singhvi) కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలోనే సీఈసీ (CEC) తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ప్రజలు ఓటేసేందుకు ఆసక్తి చూపుతున్నారని.. బ్యాలెట్ పేపర్ల (Ballot Papers)తో పోలిస్తే ఈవీఎం (EVM)ల వినియోగంతో ఓటు వేసేందుకు చాలా తక్కువ సమయం పడుతుందని కోర్టుకు తెలిపారు. పోలింగ్ బూత్‌లలో ఓటర్లకు అనుగుణంగా ఈవీఎంల సంఖ్య పెంచితే.. ఓటు వేసేందుకు పట్టే సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని సీఈసీ (CEC) తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం 3 వారాల్లోగా కౌంటర్‌ అఫిడవిట్ దాఖలు చేయాలని సీఈసీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ జనవరి 27కు వాయిదా వేసింది.

Tags:    

Similar News