Supreme Court : ఉచితాలపై సుప్రీంకోర్టులో విచారణ.. ఈసీకి నోటీసులు

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Update: 2024-10-15 08:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేంద్రంతో పాటు, భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలని కోరుతూ బెంగళూరుకు చెందిన న్యాయవాది సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే, పొలిటికల్ పార్టీలు ఎన్నికల ముందు ఉచితాలు ఇస్తామని హామీ ఇవ్వకుండా నిరోధించాలని పోల్ ప్యానెల్ ను ఆదేశించాలని కోరారు. ఉచితాల వల్ల ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతందని పిటిషన్ లో పేర్కొన్నారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై విచరాణ జరిపింది. కేంద్రానికి, ఈసీకి నోటీసులు జారీ చేసింది. అలానే, ఈ అంశంపై పెండింగ్ లో ఉన్న పలు కేసులతో కలిపి ఈ పిటిషన్ ను విచారించాలని నిర్ణయించింది. ఈ అభ్యర్థనపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఎన్నికల ముందు ఉచిత వాగ్దానాలు ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అన్నారు. ఈ హామీలు ఎన్నికల ప్రక్రియను కూడా దెబ్బతీస్తున్నాయని వెల్లడించారు.


Similar News