మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు.. తెలంగాణ నేతలకు కీలక బాధ్యతలు

జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఇటీవల హర్యానా ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు ఈ రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.

Update: 2024-10-15 10:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఇటీవల హర్యానా ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు ఈ రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్‌లను పరిశీలకులగా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ముగ్గురు నేతలకు చోటు కల్పించింది.

మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మందిని నియమించింది. వారిలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క ఉన్నారు. మరాఠ్వాడా రీజియన్ పరిశీలకులుగా సచిన్ పైలట్, మంత్రి ఉత్తమ్‌ను నియమించారు. నార్త్ మహారాష్ట్రకు మంత్రి సీతక్క, సయ్యద్ నసీర్ హుస్సేన్‌ను ఏఐసీసీ నియమించింది. అదేవిధంగా జార్ఖండ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు అన్వర్, అధిర్ రంజన్ చౌదరిని నియమించారు. కాగా, నేడు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనున్న క్రమంలో ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. అలాగే మంగళవారం జరిగిన ప్రతిష్టాత్మక మహారాష్ట్ర ఎన్నికల కీలక సమావేశంలో మహారాష్ట్ర ఇంచార్జి, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నాయకులతో పాటు వార్ రూమ్ చైర్మన్ చల్లా వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు.


Similar News