Earthquake: హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం.. భయాందోళనలో జనం

హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో భూమి కంపించింది. స్వల్ప భూకంపంతో (Earthquake) ప్రజలు భయాందోళన చెందారు.

Update: 2024-10-15 09:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో భూమి కంపించింది. స్వల్ప భూకంపంతో (Earthquake) ప్రజలు భయాందోళన చెందారు. మంగళవారం మధ్యాహ్నం మండి (Mandi) జిల్లాలో భూమి కంపించింది. ఈ మేరకు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.3గా నమోదైనట్లు వెల్లడించింది. కులు – మండి మధ్య కొండ ప్రాంతంలో భూమి కంపించినట్లు తెలిపింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, స్వల్ప స్థాయిలోనే భూ ప్రకంపనలు ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం వంటివి సంభవించలేదు. మరోవైపు భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.


Similar News