Supreme Court: స్వాతిమాలివాల్ కేసులో కేజ్రీవాల్ సెక్రటరీకి బెయిల్

రాజ్యసభ ఎంపీ స్వాతిమాలివాల్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌కు బెయిల్ మంజూరైంది.

Update: 2024-09-02 11:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ ఎంపీ స్వాతిమాలివాల్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌కు బెయిల్ మంజూరైంది. కేసుపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణ పూర్తయ్యే వరకు తిరిగి ఉద్యోగంలోకి చేరడానికి కానీ, సీఎం కార్యాలయంలోకి ఎంటర్ కావడానికి వీల్లేదని ఆదేశించింది. అలాగే కేసుకు సంబంధించి ఎక్కడా మాట్లాడడానికి కూడా వీల్లేదని హెచ్చరించింది. ఒకవేళ కోర్టు ఆదేశాలను అతిక్రమించినట్లు రుజువైతే బెయిల్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అలాగే కేసు విచారణను వేగవంతం చేసి 3 వారాల్లో పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు సూచించింది.

కాగా రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత స్వాతి మాలివాల్‌పై సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో దాడికి పాల్పడినట్లు బిభవ్ కుమార్‌పై ఆరోపణలు రావడంతో ఆయనను ఢిల్లీ పోలీసులు మే 18న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. 


Similar News