రూ. 2000 నోటు మార్పిడి.. ఆ నిబంధన పెట్టాలన్న పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు

గుర్తింపు కార్డు లేకున్నా రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు అనుమతించాలన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాన్ని బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

Update: 2023-07-10 13:04 GMT

న్యూఢిల్లీ: గుర్తింపు కార్డు లేకున్నా రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు అనుమతించాలన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాన్ని బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. రూ.2 వేల నోట్ల మార్పిడికి గుర్తింపు కార్డును తప్పనిసరి చేయాలన్న అతని అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం సోమవారం కొట్టేసింది. నోట్ల రద్దు ప్రకటించినప్పటి నుంచి నోట్ల మార్పిడి జరుగుతోందని సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది.

‘మీరు కూరగాయల విక్రేతకు రూ.2 వేల నోటు ఇచ్చారనుకోండి. అతను మీ గుర్తింపు కార్డు అడుగుతాడా..? వస్తువులను విక్రయిస్తాడా..? ఎగ్జిక్యూటివ్ గవర్నెన్స్ వాంఛనీయతను చట్టబద్ధతతో సమానం చేయడం సరికాదు. ఈ పద్ధతిలో జరిగే పెద్ద మొత్తం లావాదేవీలను చట్ట విరుద్ధమని మీరు చెబుతారా..?’ అని సీజేఐ ప్రశ్నించారు. ఈ కేసులో ఇంతకు ముందు ఢిల్లీ హైకోర్టు కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది.


Similar News