Maharashtra : మహారాష్ట్ర విపక్ష కూటమిలో కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలో విపక్ష కూటమి ‘మహా వికాస్ అఘాడీ’ (ఎంవీఏ)లో అసెంబ్లీ సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చింది.

Update: 2024-10-23 17:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలో విపక్ష కూటమి ‘మహా వికాస్ అఘాడీ’ (ఎంవీఏ)లో అసెంబ్లీ సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చింది. రాష్ట్రంలోని చెరో 85 స్థానాల్లో పోటీ చేసేందుకు శివసేన (ఉద్ధవ్), కాంగ్రెస్, ఎన్‌సీపీ (శరద్ పవార్) మధ్య అవగాహన కుదిరింది. ఈవివరాలను మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోలే బుధవారం వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లకుగానూ 270 చోట్ల శివసేన (ఉద్ధవ్), కాంగ్రెస్, ఎన్‌సీపీ (శరద్ పవార్) పార్టీలు పోటీ చేస్తున్నాయన్నారు.

మిగతా 18 స్థానాల్లో సమాజ్‌వాదీ సహా పలు మిత్రపక్షాలకు సీట్లను కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారంకల్లా ఆయా మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపుపై క్లారిటీ వస్తుందన్నారు. తప్పకుండా ఈసారి మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నానా పటోలే విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంవీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చిన విషయాన్ని శివసేన (ఉద్ధవ్) నాయకుడు సంజయ్ రౌత్ కూడా ధ్రువీకరించారు.


Similar News