Terrorist firing: ఏరోస్పేస్ కంపెనీలో ఉగ్రవాదుల కాల్పులు.. 10 మంది మృతి

టర్కీలో ఉగ్రవాదుల కాల్పులకు తెగబడ్డారు.

Update: 2024-10-23 14:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: టర్కీలో ఉగ్రవాదుల కాల్పులకు తెగబడ్డారు. బుధవారం రాజధాని అంకారాలోని టర్కీ(Turkey) ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏరోస్పేస్ కంపెనీ (Aerospace Company) ప్రధాన కార్యాలయం చొరబడిన దుండగులు(thugs) వారి వద్ద అధునాతన ఆయుదాలతో విచక్షణా రహితంగా దాడులు చేశారు. దుండగులు దాడిలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. కంపెనీ ప్రధాన కార్యాలయానికి ఇద్దరు ఉగ్రవాదులు ట్యాక్సీలో వచ్చినట్లు మీడియా సంస్థలు తెలిపాయి.. ఒకరు తనను తాను పేల్చుకోగా, మరొకరు కాంప్లెక్స్ సెక్యూరిటీ గార్డులపై కాల్పులు జరిపారు. కాగా ఈ కాల్పులకు ఏ గ్రూపు వెంటనే బాధ్యత వహించలేదు. అయితే టర్కీ(Turkey) ఇటీవలి సంవత్సరాలలో కుర్దిష్ వేర్పాటువాదులు, ఇస్లామిక్ స్టేట్ నుండి జిహాదీల నుండి ఇలాంటి దాడులను ఎదుర్కొంటుంది. కాగా ఏరోస్పేస్ కంపెనీ(Aerospace Company) ప్రధాన కార్యాలయం కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాల్చీ చంపారు.

Tags:    

Similar News