Sunita Williams: ఎట్టకేలకు భూమిపైకి రానున్న సునితా విలియమ్స్
గత 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్(Sunita Williams) , బచ్ విల్మోర్ (Butch Wilmore) భూమి మీదకు రానున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: గత 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్(Sunita Williams) , బచ్ విల్మోర్ (Butch Wilmore) భూమి మీదకు రానున్నారు. మంగళవారం ఉదయం 10.35 గంటలకు భూమిపైకి వచ్చేందుకు వీరిద్దరి ప్రయాణం ప్రారంభమైంది. ఆస్ట్రోనాట్స్ ని భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్‌లోకి వీరు చేరుకున్నారు. ఆ తర్వాత ఈ స్పేస్ షిప్ అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి ధరతిపైకి తిరిగి బయల్దేరింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.15 గంటలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది. ఇది పూర్తయిన తర్వాత ఉదయం 10.15 గంటలకు అన్‌డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి.. క్రూ డ్రాగన్‌ను వెలికితీస్తాయి. సునితా, విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ క్రూ డ్రాగన్ లో భూమిపైకి రానున్నారు.
నాసా లైవ్ స్ట్రీమింగ్
కాగా.. స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ఐఎస్‌ఎస్‌ను వీడే అన్‌డాకింగ్ దృశ్యాలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా (NASA) లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. అంతేకాకుండా, తిరుగుప్రయాణం కోసం ఆస్ట్రోనాట్స్ తమ వస్తువులను ప్యాక్ చేసుకుని క్రూ డ్రాగన్ లో కూర్చున్న విజువల్స్ కూడా వైరల్ గా మారాయి. భూమ్మీదకు వచ్చే ముందు ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాములంతా ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఇకపోతే 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ స్పేస్ షిప్ ‘స్టార్‌లైనర్’లో సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. అయితే, వారం రోజులకే వారిద్దరూ భూమిని చేరుకోవాల్సి ఉంది. కానీ, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. అప్పట్నుంచి వారిద్దరూ సునీత, విల్మోర్‌లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే ఉండిపోయారు.
Sunitha Williams: సునీత విలియమ్స్ జీతం ఎంత? అంతరిక్షంలో ఓవర్ టైమ్ సునీతాకు ఇచ్చే పరిహారం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు