మంత్రి వర్గంలోకి Stalin కుమారుడు

తమిళనాడు మంత్రి వర్గంలోకి సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఎంట్రీ ఇవ్వనున్నారు.

Update: 2022-12-13 06:52 GMT

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు మంత్రి వర్గంలోకి సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఎంట్రీ ఇవ్వనున్నారు. 14న రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమంలో ఉదయనిధి ప్రమాణం చేయనున్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. అధికార డీఎంకే యువజన విభాగానికి స్టాలిన్ ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్నారు. మంత్రి వర్గంలోకి ఉదయనిధిని తీసుకోవాలంటూ డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం స్టాలిన్ సిఫార్సును గవర్నర్ రవి ఆమోదించారని రాజ్ భవన్ తెలిపింది. సినీ నటుడు, నిర్మాత అయిన ఉదయనిధి మొదటి సారిగా 2021 ఎన్నికల్లో చెపాక్ తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాగా ఇటీవల పార్టీలో ఉదయనిధి స్టాలిన్ కు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డీఎంకే అధికారంలోకి రాగానే ఉదయనిధికి మంత్రి పదవి ఇస్తే కుటుంబ రాజకీయాల ముద్ర వేస్తారని ఆగిన స్టాలిన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Read More....

Modiపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అరెస్ట్ 

Tags:    

Similar News