SSC MTS: ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ ఎగ్జామ్ ప్రిలిమినరీ కీ విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే..!
కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్(MTS), హవల్దార్(Havaldar) పోస్టుల భర్తీకి నిర్వహించిన టైర్-1 పరీక్ష(Tier-1 Exam)కు సంబంధించి ప్రిలిమినరీ కీ(Preliminary key) విడుదలైంది.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్(MTS), హవల్దార్(Havaldar) పోస్టుల భర్తీకి నిర్వహించిన టైర్-1 పరీక్ష(Tier-1 Exam)కు సంబంధించి ప్రిలిమినరీ కీ(Preliminary key) విడుదలైంది. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ఓ ప్రకటనలో తెలిపింది. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్(HT No), పాస్ వర్డ్(Password) వివరాలతో పాటు రెస్పాన్స్ షీట్(Response sheet)ను అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. అలాగే కీ పై ఏమైన అభ్యంతరాలు(Objections) ఉంటే డిసెంబర్ 2లోగా ఆన్‌లైన్(Online)లో తెలియజేయాలని పేర్కొంది. కాగా మొత్తం 9,583 పోస్టులకు ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 14 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో పరీక్షలను నిర్వహించారు. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు సెషన్-1,2 కంప్యూటర్ నాలెడ్జ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా..హవల్దార్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.