సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌పై స్పైస్‌జెట్ క్రూ మెంబర్ దాడి.. ఎందుకు ?

దిశ, నేషనల్ బ్యూరో : స్పైస్‌జెట్ క్రూ మెంబర్‌గా పనిచేస్తున్న అనురాధా రాణి , సీఐఎస్ఎఫ్ జవాన్‌‌ గిరిరాజ్ ప్రసాద్‌ను చెంపదెబ్బ కొట్టింది.

Update: 2024-07-11 18:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో : స్పైస్‌జెట్ క్రూ మెంబర్‌గా పనిచేస్తున్న అనురాధా రాణి , సీఐఎస్ఎఫ్ జవాన్‌‌ గిరిరాజ్ ప్రసాద్‌ను చెంపదెబ్బ కొట్టింది. రాజస్థాన్‌లోని జైపూర్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐఎస్ఎఫ్ జవాన్‌ ఏదో చెబుతుండగా విని కోపోద్రిక్తురాలైన అనురాధ.. అతడిపై దాడికి పాల్పడింది. దీంతో ఆమెను అక్కడున్న సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. భద్రతా విధుల్లో ఉన్న తమకు సహకరించకుండా నేరుగా ఎయిర్ పోర్టులోకి ప్రవేశించేందుకు అనురాధా రాణి యత్నించిందన్న కారణంతో అక్కడున్న సీఐఎస్ఎఫ్ జవాన్ గిరిరాజ్ ప్రసాద్ ఆమెను అడ్డుకున్నాడు. విధి నిర్వహణలో భాగంగా అడ్డుకున్నందుకు తనపై అనురాధ రాణి అనుచిత వ్యాఖ్యలు చేసి, చేయి చేసుకుందని జవాన్ ఆరోపించాడు.

ఈ ఘటనపై సదరు జవాన్, అనురాధా రాణి పరస్పరం ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే అనురాధా రాణిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటనలో అనురాధా రాణికి మద్దతు ఇస్తూ స్పైస్ జెట్ ఓ ప్రకటన విడుదల చేసింది. గేట్ పాస్‌తోనే అనురాధా రాణి ఎయిర్ పోర్టులోకి ప్రవేశించిందని స్పష్టం చేసింది. ఎంట్రీ గేటును దాటుతుండగా అనురాధను సీఐఎస్ఎఫ్ జవాన్ అసభ్య పదజాలంతో దూషించాడని, డ్యూటీ అయ్యాక ఇంటికొచ్చి కలవాలన్నాడని స్పైస్‌జెట్ ఎయిర్ లైన్స్ ఆరోపించింది. ఇందుకుగానూ సదరు సీఐఎస్ఎఫ్ జవాన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.


Similar News