దోమల నివారణకు ప్రత్యేక రైలు

దోమల నివారణకు ఢిల్లీ రైల్వే డివిజన్ ప్రత్యేక రైలును నడుపుతోంది.

Update: 2024-08-16 17:01 GMT

దిశ, వెబ్ డెస్క్ : దోమల నివారణకు ఢిల్లీ రైల్వే డివిజన్ ప్రత్యేక రైలును నడుపుతోంది. 'మస్కిటో టర్మినేటర్ ఆన్ వీల్స్' పేరుతో ఈరోజు ప్రత్యేక ట్రకుల మీద పరుగులు తీసింది. మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక పరికరం ఓ వ్యాగన్ మీద అమర్చారు. రైలు కదులుతున్నపుడు ట్రాక్ నుండి 60 మీ దూరం వరకు దోమల మందు పిచికారి చేసేలాగా ఆ పరికరం పనిచేస్తుంది. రథ్దాన నుండి ఆదర్శనగర్ మీదుగా బాడ్లీ వరకు వెళ్ళి, మళ్ళీ న్యూఢిల్లీకి చేరుకుంటుంది అని అధికారులు పేర్కొన్నారు. దోమల నియంత్రనే లక్ష్యంగా సెప్టెంబర్ 21 వరకు ఈ రైలును నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సీజన్లో పెరిగే దోమల లార్వాలను నియంత్రించడమే లక్ష్యంగా ఈ రైలును నడపనున్నారు. ఈ రైలు ఒక్క రౌండ్లో 75 కిమీల మేర ట్రాక్ వెంబడి దోమల మందు పిచికారి చేస్తుంది.


Similar News