Ayodhya MP son: ఫైజాబాద్ ఎంపీ కుమారుడిపై కేసు నమోదు

ఫైజాబాద్‌ సమాజ్‌వాదీ పార్టీ (SP) లోక్‌సభ ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్ పై కేసు నమోదైంది. వ్యక్తి కిడ్నాప్, బెదిరింపులు, దాడి అనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Update: 2024-09-23 06:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఫైజాబాద్‌ సమాజ్‌వాదీ పార్టీ (SP) లోక్‌సభ ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్ పై కేసు నమోదైంది. వ్యక్తి కిడ్నాప్, బెదిరింపులు, దాడి అనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక ప్రాపర్టీ డీలర్ రవి తివారీ దాఖలు చేసిన ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అజిత్ ప్రసాద్, రాజు యాదవ్ సహా 15 నుంచి 20 మంది శనివారం తనపై దాడి చేసినట్లు రవి తివారి పోలీసులను ఆశ్రయించాడు. నిందితులు తమ వాహనంలోకి తనని లాగి, మొత్తం పరీక్ష సమయంలో అతనిపై భౌతికంగా దాడి చేస్తూ రఖాబ్‌గంజ్ వైపు వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన నుండి బలవంతంగా రూ. లక్ష తీసుకున్నారని.. దాడికి సంబంధించిన వీడియోని రికార్డు చేసినట్లు ఆరోపించాడు. తనని చంపేస్తానని కూడా బెదిరించినట్లు తెలిపారు. ఈ ఘటన తర్వాత నిందితుడు కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశాడు. దీంతో, అజిత్ ప్రసాద్, రాజు యాదవ్, పోలీస్ కానిస్టేబుల్ శశికాంత్ రాయ్ సహా 15 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

బీజేపీ విమర్శలు

కాగా, రవి తివారీ కిడ్నాప్ లో ఫైజాబాద్ ఎంపీ అవదేశ్ ప్రసాద్ కుమారుడి ప్రమేయం ఉందని సమాజ్ వాదీ పార్టీపై బీజేపీ నేత అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్ ఉప ఎన్నిక బరిలో అజిత్ ప్రసాద్ ఉన్నారు. కాగా.. అమిత్ మాల్వియా ఆరోపణలను ఎంపీ అవదేశ్ ప్రసాద్ తోసిపుచ్చారు. ఈ ఆరోపణలను నిరాధారమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని అన్నారు. "మిల్కీపూర్‌లో సమాజ్‌వాదీ పార్టీ గెలుస్తోంది. ఇది బీజేపీని కలవరపెడుతోంది" అని అమిత్ మాల్వియా అన్నారు. ఈ కేసు కల్పితమని రౌనాహి పోలీస్ స్టేషన్ లో దుఖీరామ్ మరణంతో ఉద్రిక్తత ఏర్పడిందన్నారు. దాని నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. ఇకపోతే, అయోధ్య జిల్లాలోని ఫైజాబాద్ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు బీజేపీ ఎంపీగా గెలిచిన లల్లూ సింగ్‌ను ఓడించి అవదేశ్ ప్రసాద్ అందరి దృష్టిని ఆకర్షించారు.


Similar News