Trains: టికెట్ లేకుండా రైళ్లో ప్రయాణించేవారికి బిగ్ షాక్.. రైల్వేశాఖ కీలక నిర్ణయం

టికెట్ లేకుండా రైళ్లో ప్రయాణించేవారికి బిగ్ షాక్..

Update: 2024-09-23 07:11 GMT

దిశ, వెబ్ డెస్క్ : మనలో కొందరు టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు. ఇక రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటి వరకు దీనిపై చర్యలు మాత్రమే తీసుకుంది.. ఇప్పటి నుంచి చర్యలు కఠినంగా తీసుకోవాలని భారత రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

వచ్చే నెలలో రానున్న పండగలను దృష్టిలో పెట్టుకుని టికెట్‌ లేకుండా రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఈ సారి చెక్‌ పెట్టేందుకు ప్రత్యేకంగా తనిఖీలు చేసేందుకు రెడీ అవ్వబోతుంది. దీనిలో భాగంగానే అక్టోబర్ 1 నుంచి 15 వరకు, అలాగే అక్టోబర్ 25 నుంచి నవంబర్‌ 10 వరకు ఎవరైతే టికెట్‌ లేకుండా ట్రైన్ లో కనిపిస్తారో? వారి కోసం ప్రత్యేక డ్రైవ్ ను ప్రారంభించనుంది. 17 జోన్లల ఉన్న జనరల్‌ మేనేజర్‌లకు రైల్వేశాఖ ఓ లేఖను రాసింది. తనిఖీల నివేదికలను కూడా నవంబర్‌ 18 కి పంపించాలని కోరింది. 

అయితే, ఈ టికెట్‌ లేకుండా వెళ్లే వారిలో పోలీసులే ఎక్కువగా ఉన్నారని రైల్వే కమర్షియల్ అధికారులు తెలిపారు. ఈ మధ్య గాజియాబాద్‌ - కాన్పుర్‌ సెక్షన్‌లో చెకింగ్ చేయగా.. కొన్ని రైళ్లలో వందలాది మంది పోలీసులు టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు. వాళ్లందరికీ కూడా జరిమానా విధించినట్లు చెప్పారు. ఆర్టీఐ ( RTI) వివరాల ప్రకారం ఒకసారి చూసుకుంటే.. 2023-24 లో 3.61 కోట్ల మంది టికెట్ లేకుండా ప్రయాణించారు. వారి నుంచి భారత రైల్వేశాఖ జరిమానా విధించి రూ.2,231 కోట్లు వసూలు చేసింది. 

Tags:    

Similar News