Congress: నా జీవిత లక్ష్యం మోడీకి ఇష్టం లేదేమో!.. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ

బహుజనులకు న్యాయం చేయడమే నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నానని, బహుషా! బహుజనులు కులగణన ద్వారా హక్కులు పొందడం మోడీకి ఇష్టం లేదేమోనని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.

Update: 2024-09-23 08:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బహుజనులకు న్యాయం చేయడమే నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నానని, బహుషా! బహుజనులు కులగణన ద్వారా హక్కులు పొందడం మోడీకి ఇష్టం లేదేమోనని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కులగణనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన మోడీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. అంతేగాక రిజర్వేషన్లపై దేశంలోని పలు చోట్ల ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. బహుజన వ్యతిరేక బీజేపీ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా రిజర్వేషన్లకు నష్టం జరగనివ్వబోమని స్పష్టం చేశారు.

అలాగే సమగ్ర కులగణన జరిగే వరకు ఆగబోమని, రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించడం ద్వారా, ప్రతి తరగతికి హక్కులు, వాటా మరియు న్యాయం పొందాలని, అంతేగాక జనాభా లెక్కల నుండి పొందిన సమాచారం భవిష్యత్ విధానాలకు ఆధారం కాకూడదని కాంగ్రెస్ నేత చెప్పారు. ఇక 'కుల గణన' గురించి మాట్లాడటానికి కూడా మోడీ భయపడుతున్నారని, బహుషా! ఆయనకు బహుజనులు హక్కులు పొందడం ఇష్టం లేదేమోనని వ్యాఖ్యానించారు. నాకు ఇది రాజకీయ సమస్య కాదని, బహుజనులకు న్యాయం చేయడమే నా జీవిత లక్ష్యమని, మళ్లీ మళ్లీ అదే చెబుతానని రాహుల్ గాంధీ ఎక్స్ లో ద్వారా తెలియజేశారు.


Similar News