బడ్జెట్ సెషన్ ఒకరోజు పొడిగింపు.. కారణం అదే

దిశ, నేషనల్ బ్యూరో : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఒకరోజు పొడిగించినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.

Update: 2024-02-07 16:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఒకరోజు పొడిగించినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఇంతకుముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9నే సెషన్ ముగియాల్సి ఉండగా.. దాన్ని ఈనెల 10(శనివారం) వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2014 సంవత్సరంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు(పదేళ్ల వ్యవధిలో) పాలనలో వచ్చిన సంస్కరణలు, దేశం సాధించిన వికాసంతో ముడిపడిన వివరాలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు ‘శ్వేతపత్రం’ సమర్పించనున్నారు. ఆమె దాన్ని రాజ్యసభ, లోక్‌సభ రెండింటిలోనూ ప్రవేశపెట్టనున్నారు. దీంతోపాటు ఆర్థిక బిల్లు, బడ్జెట్ చర్చ, గ్రాంట్ల విడుదల వంటి పార్లమెంటు ఎజెండా అంశాలు కూడా ఇంకా మిగిలి ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పార్లమెంటు బడ్జెట్ సెషన్ గడువును ఒకరోజు పొడిగించాలని నిర్ణయించారు. పార్లమెంటు సాధారణంగా వారాంతాల్లో పని చేయదు. కానీ శనివారాల్లో సభలు సమావేశమైన పలు సందర్భాలు గతంలోనూ ఉన్నాయి.

Tags:    

Similar News