Snow Effect : మంచు ఎఫెక్ట్..హిమాచల్ ప్రదేశ్‌కు ఎల్లో అలెర్ట్ !
ఉత్తర భారతా(North India)న్ని హిమపాతం(Snowfall)వణికిస్తోంది. ప
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తర భారతా(North India)న్ని హిమపాతం(Snowfall)వణికిస్తోంది. పశ్చిమ గాలుల కారణంగా హిమాలయ రాష్ట్రాల్లో విపరీతంగా మంచు కురుస్తుండటంతో ఐఎండీ(IMD) ప్రజలను అప్రమత్తం(Alert) చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) రాష్ట్రానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ(Yellow Alert Issued) చేసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు తీవ్ర హిమపాతం ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమ గాలుల కారణంగా హిమాలయ రాష్ట్రాల్లో వర్షాలు, హిమపాతం అధికంగా ఉంటాయని ఐఎండీ పేర్కొంది.
ఢిల్లీ విమానాశ్రయంలో పొగమంచు కారణంగా 100కు పైగా విమానాల రాకపోకలకు ల్యాండింగ్, టేకాఫ్ లో సమస్యలు ఎదురవ్వడంతో ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయం నుంచి వెళ్లే 30 విమానాలను రద్దు చేశారు.