షాకింగ్ న్యూస్.. దేశంలో మరో HMPV చైనా వైరస్ కేసు నమోదు

చైనాల్లో అత్యంత వేగంగా విజృంబిస్తున్న HMPV వైరస్ భారత్ కు కూడా పాకింది. సోమవారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఐసీఎమ్ఆర్ అధికారికంగా ప్రకటించింది.

Update: 2025-01-06 08:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనాల్లో అత్యంత వేగంగా విజృంబిస్తున్న HMPV వైరస్ భారత్ కు కూడా పాకింది. సోమవారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఐసీఎమ్ఆర్ అధికారికంగా ప్రకటించింది. దీంతో దేశ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్న క్రమంలో మరో మూడో HMPV వైరస్ కేసును గుర్తించినట్లు ఆహ్మదాబాద్ అధికారులు ప్రకటించడంతో ప్రజల ఆందోళన తీవ్రతరం అయింది. కాగా ఈ మూడో కేసు అహ్మదాబాద్‌లోని 2 నెలల శిశువులో కనుగొనబడింది. ప్రస్తుతం చిన్నారి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. HMPV వైరస్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

అహ్మదాబాద్‌లో చిన్నారి HMPV కేసు పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వైరస్ గురించి ఆరోగ్య మంత్రి రిషికేశ్ పటేల్ (Health Minister Rishikesh Patel) మాట్లాడుతూ.. ఈ వైరస్ సోకిన వారికి వారి లక్షణాల ప్రకారం చికిత్స అందించబడుతుంది. ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో పరీక్ష కిట్‌లను ఏర్పాటు చేస్తుంది. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైరస్‌పై అప్రమత్తంగా ఉన్నాయి. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైతే ఏమి చేయాలి, ఏమి చేయకూడదనే దాని పై మార్గదర్శకాలు అందించబడతాయని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.


Similar News