Bangladesh: షూట్ ఆన్ సైట్ ఆర్డర్లు జారీ.. ఇప్పటివరకు 133 మంది మృతి!

రిజర్వేషన్ల వివాదంతో బంగ్లాదేశ్‌ అట్టడుకుతోంది. హింసాత్మక (Bangladesh Violence) ఘటనలు అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినా, సైన్యాన్ని మోహరించినా ఫలితం మాత్రం శూన్యం.

Update: 2024-07-21 03:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రిజర్వేషన్ల వివాదంతో బంగ్లాదేశ్‌ అట్టడుకుతోంది. హింసాత్మక (Bangladesh Violence) ఘటనలు అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినా, సైన్యాన్ని మోహరించినా ఫలితం మాత్రం శూన్యం. ఉద్రిక్తతలు ఎంతకీ తగ్గకపోయే సరికి షూట్ ఆన్ సైట్ ఆర్డర్లు జారీ అయ్యాయి. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయినట్లు అధికారులు తెలిపారు. ఘర్షణల్లో ఇప్పటివరకు 133 మంది చనిపోయారు. శుక్రవారం ఒక్క రోజే 43 మంది మరణించినట్లు స్థానిక టీవీ ఛానల్‌ వెల్లడించింది. ఢాకా( Dhaka) మెడికల్ కాలేజ్ హాస్పిటల్ దగ్గర 23 డెడ్ బాడీలు చూసినట్లు మరో మీడియాలో కథనాలు వచ్చాయి. గతవారం నుంచి మొదలైన ఆందోళనల్లో హింసవల్ల 133 మంది మరణించినట్లు తెలుస్తోంది. వేల మంది గాయపడినట్లు సమాచారం. కనీసం 150 మంది పోలీసులు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మరో 150 మంది పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయయి. శుక్రవారం నార్సింగ్డి జైలు నుంచి 800 ఖైదీలు పారిపోయినట్లు తెలుస్తోంది. ఆందోళనకారులు జైలుపై దాడి చేసి నిప్పు పెట్టడంతో ఇదే అదనుగా వారు పారిపోయారు.

స్వదేశానికి భారతీయులు

బంగ్లాదేశ్‌లో చదువుకుంటున్న పలువురు భారత విద్యార్థులు(India) సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటివరకు సుమారు 1,000 మంది విద్యార్థులు వచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా తెలిపారు. 778 మంది సరిహద్దు మార్గాల ద్వారా స్వదేశానికి చేరుకున్నారు. మరో 200 మంది విమానాల్లో భారత్ కు తిరిగి వచ్చారు. బంగ్లాదేశ్ కు వెళ్లొద్దని తమ పౌరులను అమెరికా(USA) విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఉద్రిక్తలు నెలకొన్న బంగ్లా నుంచి కొంతమంది దౌత్యవేత్తలను, వారి కుటుంబాలని తిరిగి రప్పిస్తామని పేర్కొంది.


Similar News