అలా చేయ‌మ‌ని చెప్పింది ప్ర‌ధాని న‌రేంద్ర మోడినే.. ఆ నేత భార్య వెల్ల‌డి!

ఇటీవ‌ల మోడీ సిమ్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా గుర్తుచేసుకున్నారు. BJP Leader Wife Recalls How She Learnt 'Sabu Dana Khichdi'

Update: 2022-06-02 10:32 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః భార‌త ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిమ్లా పర్యటన పూర్తైన‌ ఒక రోజు తర్వాత, ఈ విష‌యంపై మీడియాలో ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ప్ర‌ధాని మోడి రాజ‌కీయ దురంధ‌రుడే కాకుండా భోజ‌న ప్రియుడ‌ని కూడా అంటారు. అయితే, ఆయ‌న 90వ దశకం చివరిలో ఓ సారి సిమ్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. అప్పుడు పార్టీ హిమాచల్ ప్రదేశ్ యూనిట్‌కి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న స్థానిక బిజెపి నాయకుడి భార్య రుచిక‌ర‌మైన‌ 'సాబు దానా కిచ్డీ' వండడం, అది మోడీకి అంత‌గా న‌చ్చ‌క‌పోవ‌డంతో, రుచిక‌ర‌మైన కిచ్డీ ఎలా చేయ‌లో ఆయ‌న నేర్పించ‌డాన్ని ఇటీవ‌ల మోడీ సిమ్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆమె గుర్తుచేసుకున్నారు.

1997లో నవరాత్రుల సమయంలో తాను మోడీకి కిచ్డీ వండి పెట్టానని, అయితే అది ఆయన ఆశించిన స్థాయిలో లేదని స్థానిక బీజేపీ నేత దీపక్ శర్మ భార్య సీమా శర్మ పీటీఐతో అన్నారు. ఆ తర్వాత కిచ్డీని ఎలా వండాలో చూపించార‌ని ఆమె గుర్తు చేసుకున్నారు. మంగళవారం తన సిమ్లా పర్యటనలో మోడీ, దీపక్ శర్మ గురించి ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్‌ను అడిగారు. అనంతరం రిడ్జ్ మైదాన్‌లో జరిగిన ర్యాలీలో ఠాకూర్ ప్రసంగిస్తు, దీప‌క్ శ‌ర్మా ప్ర‌స్తావ‌న‌లో ఈ కిచ్డీ సంద‌ర్భాన్ని ప్రస్తావించారు. 1997లో రెండో నవరాత్రుల సందర్భంగా మోదీ 'సాబు దానా కిచ్డీ (సాగో)' తినాల‌నుకున్నారినీ, అప్పుడు దీప‌క్ శ‌ర్మ భార్య సీమా శర్మ మోడీకి అది వండి పెట్టారని, అయితే అది తాను ఆశించిన స్థాయిలో లేదని సీమా శ‌ర్మ‌ గుర్తు చేసుకున్నారు. మీడియాతో సీమా శర్మ మాట్లాడుతూ, మోడీ అప్పుడు పీటర్‌హాఫ్ హోటల్‌లో బస చేశారని, ఆయ‌న‌ తనతో మాట్లాడటానికి పిలిచార‌ని, మంచి 'సాబు దానా కిచ్డీ' ఎలా ఉడికించాలో అప్పుడు నేర్పించార‌ని ఆమె చెప్పారు. అప్పటి నుంచి నేను 'సాబు దానా కిచ్డీ' వండినప్పుడల్లా మోదీ నాకు నేర్పించిన విధంగానే వండుతాను'' అని సీమా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.


Similar News