వయనాడ్ నుంచి బరిలో ప్రియాంక.. కాంగ్రెస్ సీనియర్లు ఏమన్నారంటే?
కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో త్వరలో జరిగే ఉప ఎన్నిక బరిలో ప్రియాంక గాంధీ ఉన్నారు. ప్రియాంక పొలిటికల్ ఎంట్రీపై కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో త్వరలో జరిగే ఉప ఎన్నిక బరిలో ప్రియాంక గాంధీ ఉన్నారు. ప్రియాంక పొలిటికల్ ఎంట్రీపై కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక సందేహాలేమీ లేవు.. వయనాడ్ లో గెలిచేది ప్రియాంకే అని శశిథరూర్ ఆమె ఫొటోను షేర్ చేశారు. కేరళ ప్రజల తరఫున గళమెత్తేందుకు ప్రియాంక పార్లమెంట్‌కు వెళ్లనున్నారని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ పేర్కొన్నారు. ఇకపై ఇద్దరు గాంధీలు పోరాటానికి సిద్ధమయ్యారని హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేరళ నుంచి ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసిన మహిళా అభ్యర్థులెవరూ గెలవలేదు. ఒకవేళ వయనాడ్‌లో జరిగే ఉప ఎన్నికలో ప్రియాంక గెలిస్తే.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేరళలో విజయం సాధించిన తొలి మహిళా ఎంపీగా నిలవనున్నారు. కాగా.. 2019 నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. కానీ, ఇప్పటివరకు ఆమె ఇప్పటివరకు ఏ స్థానంలోనూ పోటీ చేయలేదు. వయనాడ్ నుంచి ప్రియాంక గెలిస్తే.. ఆమె తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు.