ప్రతిరోజు దేవుడ్ని ప్రార్ధిస్తున్నాడని ఒడిషా హైకోర్టు సంచలన తీర్పు!

ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో శిక్ష పడిన నిందితుడిపై ఒడిశా హైకోర్టు వెలువరించిన తీర్పు సంచలనంగా మారింది.

Update: 2024-07-02 06:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో శిక్ష పడిన నిందితుడిపై ఒడిశా హైకోర్టు వెలువరించిన తీర్పు సంచలనంగా మారింది. ప్రతిరోజూ దేవుడ్ని పూజిస్తున్నాడని మరణ శిక్షను జీవితఖైదుగా మార్చుతూ తీర్పునివ్వడంతో ఈ విషయం వైరల్ గా మారింది. ఒడిశాలోని ఎస్ కే ఆసిఫ్ అలీ అనే వ్యక్తి ఆరేళ్ళ పాపపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలాడు. నిందితుడికి జగత్‌సింగ్‌పూర్‌లో ఉన్న పోక్సో కోర్టు మరణ శిక్షతో పాటు 1.5 లక్షల పరిహారాన్ని చెల్లించాలని తీర్పునిచ్చింది. దీనిని ఒడిశా హై కోర్టు మరణ శిక్షను జీవితఖైదుగా మారుస్తూ.. 106 పేజీల తీర్పును వెలువరించింది.

ఈ తీర్పు ఇచ్చే సమయంలో.. "ఈ కేసులో నింధితుడిగా ఉన్న ఆసీఫ్ అలీ రోజూ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాడని, అతడు దేవుడి ముందు లొంగిపోయాడని, చేసిన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడని, అందుకే మరణ శిక్షను జీవితఖైదుగా మారుస్తున్నాము అని" హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేగాక పోస్సో కోర్టు తీర్పు ప్రకారం బాధిత కుటుంబానికి ఇవ్వాల్సిన పరిహారాన్ని 1.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నామని, ఆ పరిహారాన్ని బాధిత కుటుంబానికి అందించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒడిశా హైకోర్టు అత్యాచార నేరంలో తీర్పు ఇచ్చే సమయంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Similar News