‘హలాల్’ సంస్థలపై బలవంతపు చర్యలొద్దు.. మరో రెండు సంస్థల రక్షణకు సుప్రీం ఆర్డర్

దిశ, నేషనల్ బ్యూరో : ‘హలాల్’ మార్క్‌తో ఉత్పత్తుల తయారీ, అమ్మకంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు మరో రెండు సంస్థలకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆదేశాలిచ్చింది.

Update: 2024-02-12 12:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘హలాల్’ మార్క్‌తో ఉత్పత్తుల తయారీ, అమ్మకంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు మరో రెండు సంస్థలకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. యూపీ సర్కారు బలవంతపు చర్యల నుంచి ‘హలాల్ ఇండియా’ సంస్థ, జమియత్ ఉలమా-ఎ-మహారాష్ట్ర సంస్థలకు చెందిన ఆఫీస్ బేరర్లకు కూడా మధ్యంతర రక్షణ కల్పించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆర్డర్స్ జారీ చేసింది. ఇదే కేసులో గత నెలలో జమియత్ ఉలమా-ఎ-హింద్ అధ్యక్షుడు మహమూద్ మదనీ, ‘హలాల్ ట్రస్ట్‌’కు చెందిన పలువురు ఆఫీస్ బేరర్లకు కూడా మధ్యంతర రక్షణ కల్పించే ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఇచ్చింది. హలాల్ ఉత్పత్తుల తయారీ, అమ్మకం, నిల్వ, పంపిణీపై బ్యాన్ విధిస్తూ నవంబర్ 18న యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. అయితే ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేయడంతో పాటు తమపై ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును హలాల్ ఇండియా సంస్థ ఆశ్రయించింది. జైన్, సాత్విక్, కోషర్ వంటి ఇతర రకాల ఫుడ్ సర్టిఫికేషన్లను మినహాయించి.. కేవలం హలాల్ సర్టిఫికేషన్‌ను మాత్రమే టార్గెట్ చేయడం సరికాదని హలాల్ ఇండియా సంస్థ వాదన వినిపించింది. యూపీ ప్రభుత్వం ఏకపక్షంగా మతం ప్రాతిపదికన హలాల్ ధృవీకరణను రద్దు చేయడం సరికాదని పేర్కొంది.

Tags:    

Similar News