China : పాంగోంగ్ సరస్సు సమీపంలో చైనా కొత్త ఆర్మీ బేస్

దిశ, నేషనల్ బ్యూరో : భారత్, చైనా ఆక్రమిత టిబెట్ సరిహద్దుల్లో పాంగోంగ్ సరస్సు ఉంది.

Update: 2024-10-14 19:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భారత్, చైనా ఆక్రమిత టిబెట్ సరిహద్దుల్లో పాంగోంగ్ సరస్సు ఉంది. ఈ సరస్సు నుంచి తమ వైపున ఉన్న భూభాగంలో చైనా కొత్త సైనిక స్థావరాన్ని నిర్మించింది. పాంగోంగ్ సరస్సుకు సమీపంలోని ఓ ప్రదేశంలో భారీగా వెలసిన నిర్మాణాలతో శాటిలైట్ ఫొటోలు తాజాగా బయటికి వచ్చాయి. ఈ ఫొటోలను అమెరికాకు చెందిన మక్సార్ సంస్థ ఈనెల 9వ తేదీన తీసింది. 2020 సంవత్సరంలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతానికి తూర్పు దిశగా 38 కిలోమీటర్ల దూరంలో ఈ కొత్త సైనిక స్థావరాన్ని చైనా నిర్మించిందని సమాచారం.

అక్కడ దాదాపు 70 భవనాలను చైనా ఆర్మీ నిర్మించిందని అంటున్నారు. ఒక్కో భవనంలో 8 మంది సైనికులు, 10 టన్నుల సైనిక సామగ్రిని నిల్వ చేసే వీలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైనా నిర్మించిన కొత్త సైనిక స్థావరానికి మంచినీటి వసతి, విద్యుత్ పంపిణీ వసతి కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. సైనిక హెలికాప్టర్లు దిగేందుకు ప్రత్యేక హెలిప్యాాడ్‌ను సైతం నిర్మిస్తున్నట్లు తెలిసింది.


Similar News