ప్రముఖ సింగర్‌కు షాకిచ్చిన సర్కార్!
యూపీలోని యోగి ఆదిత్యానాథ్ పాలనలోని పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో: యూపీలోని యోగి ఆదిత్యానాథ్ పాలనలోని పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాన్పూర్‌లో అక్రమ ఇళ్లను కూల్చివేత సందర్భంగా తల్లీ కూతుళ్ల మరణంపై ప్రముఖ భోజ్ పురి సింగర్ నేహా సింగ్ రాథోడ్ పాడిన పాటపై స్థానిక పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ పాట యూపీలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆమె పాటపై మాత్రం యోగి సర్కార్ మండిపడుతోంది.
ఆమె పాట సమాజంలో అసమ్మతి, ఉద్రిక్తతలు సృష్టించేలా ఉందని ఆరోపిస్తూ నేహా సింగ్‌కు యూపీ పోలీసులు నోటీసులు అందజేశారు. నోటీసులు అందుకున్న మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని లేకుంటే ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాని హెచ్చరించారు. నేహా సింగ్ ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 'యూపీ మే కా బా' పాటతో పాపులర్ అయింది.
గుజరాత్ ఎన్నికలకు ముందు మోర్బీ వంతెన కూలిపోవడం గురించి కూడా ఆమె 'గుజరాత్ మే కా బా' అంటూ పాట పాడింది. తాజాగా తల్లీకూతుళ్ల మరణాన్ని ప్రశ్నిస్తూ 'యూపీ మే కా బా (పార్ట్2)' సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో ఈ పాటలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా అని నిలదీస్తున్నాయి.
'यू पी में का बा!' पर पुलिस का नोटिस..!#Nehasinghrathore #up @Uppolice @myogiadityanath @myogioffice #democracy pic.twitter.com/szZUsqvRCu
— Neha Singh Rathore (@nehafolksinger) February 21, 2023