Sanjay Raut: 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి సంజయ్ రౌత్

Sanjay Raut sent to Judicial Custody till August 22| మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఊరట లభించలేదు. పాత్రాచాల్ కుంభకోణం కేసులో ముంబై ప్రత్యేక కోర్టు సోమవారం మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మనీలాండరింగ్ కేసులో ఆగస్టు 1వ తేదీన

Update: 2022-08-08 09:30 GMT

ముంబై: Sanjay Raut sent to Judicial Custody till August 22| మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఊరట లభించలేదు. పాత్రాచాల్ కుంభకోణం కేసులో ముంబై ప్రత్యేక కోర్టు సోమవారం మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మనీలాండరింగ్ కేసులో ఆగస్టు 1వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంజయ్ రౌత్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 8వ తేదీన కస్టడీ సమయం ముగియడంతో సంజయ్‌ను ఈడీ కోర్టులో హాజరుపర్చింది.

ఈ క్రమంలో న్యాయస్థానం ఆగస్టు 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. అయితే కస్టడీ సమయంలో ఇంటి భోజనం, మందుల కోసం సంజయ్ రౌత్ కోర్టుకు అభ్యర్థించడంతో కోర్టు దీనికి అంగీకరించింది. అలాగే ప్రత్యేక బెడ్డు కేటాయించాలని కోరడంపై కోర్టు నిరాకరించింది. కాగా, గత శనివారం సంజయ్‌ రౌత్ భార్య వర్షా రౌత్‌ను మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ జరిపింది.

ఇది కూడా చదవండి: వెంకయ్య నాయుడికి ప్రధాని మోడీ వీడ్కోలు

Tags:    

Similar News