Sadhguru Vasudev : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఆపండి.. సద్గురు విజ్ఞప్తి

బంగ్లాదేశ్‌లో గత కొన్ని రోజులుగా హింసాత్మకంగా ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-07 07:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బంగ్లాదేశ్‌లో గత కొన్ని రోజులుగా హింసాత్మకంగా ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. తాజాగా అక్కడ చోటు చేసుకుంటున్న పరిస్థితులపై ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సద్గురు వాసుదేవ్‌ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.బంగ్లాదేశ్‌లోని హిందువులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వానికి సద్గురు విజ్జప్తి చేశారు.

ఈ క్రమంలో సద్గురు X వేదికగా మాట్లాడూతూ.. 'హిందువులపై జరుగుతున్న దాడులు కేవలం బంగ్లాదేశ్ అంతర్గత విషయం కాదని పేర్కొన్నారు.మన పక్క దేశాలలో నివసిస్తున్న మైనారిటీ ప్రజల భద్రత కోసం భారత్ వెంటనే చర్యలు చేపట్టేలా కృషి చేయాలన్నారు . మైనారిటీ వర్గాల ప్రజలకు భారత్ ఎల్లప్పుడూ అండగా నిలవాలని, అలా నిలవని పక్షంలో భారత్ ఎప్పుడు అఖండ భారత్ కాదని సద్గురు సృష్టం చేశారు.దురదృష్టవశాత్తూ ఈ దేశంలో భాగమైన ప్రాంతం .. మన పొరుగు ప్రాంతంగా మారిందని , అయితే ఈ దురాగతాల నుండి మన నాగరికతకు చెందిన వారిని రక్షించడం మన బాధ్యతని సద్గురు వాసుదేవ్ వెల్లడించారు.


Similar News