Hilsa : భారత్‌కు ‘హిల్సా’ ఎగుమతిపై బ్యాన్ ఎత్తేసిన బంగ్లాదేశ్

దిశ, నేషనల్ బ్యూరో : వచ్చే నెలలో భారత్‌లో దుర్గాపూజ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.

Update: 2024-09-21 17:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో : వచ్చే నెలలో భారత్‌లో దుర్గాపూజ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈనేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిల్సా చేపల ఎగుమతిపై గత నెలలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధాన్ని ఎత్తేయాలని బంగ్లాదేశ్‌కు చెందిన చేపల ఎగుమతిదారుల సంఘాలు ఇటీవలే ఆ దేశ వాణిజ్యశాఖను కోరాయి.

ఆ వినతిపై బంగ్లాదేశ్ సర్కారు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీంతో తొలి విడతగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు 3వేల టన్నుల హిల్సా చేపలను ఎగుమతి చేయనున్నారు. ఈ చేపలతో దుర్గాపూజ వేళ భారత్‌లో భక్తుల అవసరాలు తీరుతాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలాచోట్ల దుర్గా ఉత్సవాల వేళ చేపలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు.


Similar News