PM Narendra Modi: అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ..పలు కీలక అంశాలపై చర్చ..!

భారత ప్రధాని(Prime Minister) నరేంద్ర మోడీ(Narendra Modi) మూడు రోజుల పర్యటన నిమిత్తం అగ్రరాజ్యం అమెరికా(USA) చేరుకున్నారు.

Update: 2024-09-21 18:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని(Prime Minister) నరేంద్ర మోడీ(Narendra Modi) మూడు రోజుల పర్యటన నిమిత్తం అగ్రరాజ్యం అమెరికా(USA) చేరుకున్నారు.భారత కాలమాన ప్రకారం శనివారం రాత్రి 7.30 గంటలకి ఫిలడెల్ఫియా (Philadelphia)కు చేరుకున్నారు. ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు ఫిలడెల్ఫియాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి(Philadelphia International Airport)తరలివచ్చారు.ఎన్‌ఆర్‌ఐలకు మోడీ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. వాళ్లిచ్చిన బహుమతులను స్వీకరించి వారితో కలిసి సెల్ఫీలు(selfie) దిగారు. మూడు రోజుల పాటు మోడీ అమెరికాలో పర్యటించనున్నారు.


ప్రధాని మోడీ తన పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు(US President) జో బైడెన్(Joe Biden), ఆస్ట్రేలియా ప్రధాని(Australian PM) ఆంటోనీ అల్బానీస్(Anthony Albanese), జపాన్ ప్రధాని(Japan PM)ఫుమియో ఖిషిడ(Fumio Kishida)లతో కలిసి శనివారం డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో నిర్వహించే నాల్గవ క్వాడ్‌ సమ్మిట్‌లో పాల్గొంటారు.భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేసే క్రమంలో ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.అలాగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(UN General Assembly)లో జరిగే 'సమ్మిట్ అఫ్ ది ఫ్యూచర్'(Summit of the Future) కార్యక్రమంలో మోడీ పాల్గొననున్నారు. ఆదివారం(సెప్టెంబర్ 22) న్యూయార్క్‌ (New York)లో ప్రవాస భారతీయులతో మోడీ సమావేశమవుతారు.దాదాపు 14 వేల మంది ప్రవాస భారతీయులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.



Similar News