Maharashtra: పూణే సమీపంలో ఓకారులో రూ.5 కోట్లు పట్టివేత

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగనున్నాయి. కాగా.. అన్ని ప్రాంతాల్లో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Update: 2024-10-22 06:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగనున్నాయి. కాగా.. అన్ని ప్రాంతాల్లో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెకింగ్ లో భాగంగా.. పూణే సమీపంలో ఓ కారులో భారీగా నగదు పోలీసులకు పట్టుబడింది. ఖేడ్ శివ్‌పూర్ టోల్ ప్లాజా సమీపంలో ఓ వాహనంలో రూ. 5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. కారును రాజ్‌గడ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో ఉన్నవారిలో శివసేన ఎమ్మెల్యే షాహాజీబాపు పాటిల్ సహచరుడిగా భావిస్తున్న షాహాజీ నలవాడే కూడా ఉన్నారు. అధికారిక రికార్డుల ప్రకారం.. పట్టుబడిన వాహనం పొల్యూషన్ సర్టిఫికేట్ గడువు 2023లో ముగిసింది.

ఎంపీ సంజయ్ రౌత్ మండిపాటు

కాగా.. ఈ కేసుపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఆ కారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు చెందినదని ఫైర్ అయ్యారు. అలాగే వాహనంలో పోలీసులు చెప్పిన రూ.5 కోట్లకు బదులు రూ.15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి రూ.75 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని ఆరోపించారు.


Similar News